Puttaparthi: మాన‌వ‌త్వం చాటుకున్న ఎమ్మెల్యే సింధూర‌రెడ్డి

దారిన వెళ్తున్న ఎమ్మెల్యే సింధూర రోడ్డుప్రమాదంలో క్షతగాత్రులకు మానవీయ సాయం అందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Nov 2024 9:57 AM IST
Puttaparthi MLA Sindhura Reddy Showed Humanity
X

Puttaparthi: మాన‌వ‌త్వం చాటుకున్న ఎమ్మెల్యే సింధూర‌రెడ్డి

Puttaparthi: బుక్కపట్నం మండలంలో దీపం పథకం కింద సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని పుట్టపర్తికి వస్తున్న ఎమ్మెల్యే సింధూర ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. తన కాన్వాయ్ ఆపి విషయాన్ని పోలీసులకు ప్రమాద సమాచారం అందించారు. అంబులెన్స్ సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా దగర ఉండి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రికి రప్పించి, వారికి ధైర్యం చెప్పారు. తాత్కాలిక ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story