Purandeswari: ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి చారిత్రక అవసరం

Purandeswari: కూటమి బలోపేతానికి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలి

Jyothi
Published on: 26 March 2024 2:16 PM IST
Purandeswari Interesting Comments On TDP Janasena BJP Alliance
X

Purandeswari: ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి చారిత్రక అవసరం

Purandeswari: రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి చారిత్రక అవసరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఈ కూటమిని త్రివేణి సంగమంగా అభివర్ణించారు. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులను రాష్ట్ర, జిల్లాల ఇన్చార్జిలకు పురందేశ్వరి పరిచయం చేశారు. ఎన్నికలలో కూటమి ఏర్పాటు ఆవశ్యకత, ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను వివరించారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని.. జెండాలు వేరైనా... తమ లక్ష్యం ఒక్కటేనని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story