Andhra Pradesh: పల్స్ పోలియోకు 31 కేంద్రాలు ఏర్పాటు

పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 19 న పల్స్ పోలియో నిర్వహించనుంది.

S. Srikanth
Published on: 17 Jan 2020 6:54 PM IST
Andhra Pradesh: పల్స్ పోలియోకు 31 కేంద్రాలు ఏర్పాటు
X

అంబాజీపేట: పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 19 న పల్స్ పోలియో నిర్వహించనుంది. 67 విడత జాతీయ పల్స్ పోలియో కు మండలంలో 31 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అంబాజీపేట, ముక్కామల పి.హెచ్.సి వైద్యాధికారులు డాక్టర్ డి.వి. సత్యం, ఎం.విజయలక్ష్మి లు తెలిపారు.

మండలంలో ఉన్న 16 గ్రామాలకు సంబంధించి 0-5 సంవత్సరాల వయసు గల 4,397 మంది చిన్నారులను గుర్తించామని... వీరికి ఆదివారం నిర్వహించబోయే 31 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా 148 మంది ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

ప్రత్యేకంగా అంబాజీపేట, ముక్కామల బస్ స్టేషన్ల లో, మొబైల్ పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ నెల 21,22 తేదీల్లో సిబ్బంది మండల పరిధిలో ఉన్న 12,885 ఇళ్లకు తిరిగి... ఇంకా ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులుంటే, పోలియో చుక్కలు వేస్తారన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story