ఏపీ అసెంబ్లీ దగ్గర గందరగోళం.. పోలీసులతో బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి వాగ్వాదం

AP Assembly: బైబై జగన్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేల నిరసన

Jyothi
Published on: 5 Feb 2024 11:40 AM IST
Protest by TDP MLAs at AP Assembly
X

ఏపీ అసెంబ్లీ దగ్గర గందరగోళం.. పోలీసులతో బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి వాగ్వాదం

AP Assembly: ఏపీ అసెంబ్లీ దగ్గర గందరగోళం చోటు చేసుకుంది. బై బై జగన్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. సచివాలయం సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు పోలీసులు. బారికేడ్లను తోసుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి.

సభకు వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పనైపోయిన ప్రభుత్వం గురించి.. ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముంటుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. అందుకోసమే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలను అడ్డుకునే.. కొత్త సాంప్రదాయానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టిందని సైటెర్ వేశారు.

Jyothi

Jyothi

Next Story