సీమ కరువుకు అనుసంధానమే సమాధానమన్న విజయసాయి

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేయాల్సిందిగా వైసీపీఎంపీ విజయ సాయిరెడ్డి

admin1
Updated on: 19 Nov 2019 10:35 PM IST
vijayasai reddy
X
vijayasai reddy

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేయాల్సిందిగా వైసీపీఎంపీ విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినా, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కరువు ముప్పు తప్పేలా లేదన్నారు. గోదావరి,కృష్ణాలను అనుసంధానిస్తే తప్ప ప్రతీ ఏటా ఇదే కరువు వెంటాడటం ఖాయమని అన్నారు. అందుకే సీఎం జగన్ నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలనుకుంటున్నామన్నారు.నదుల అనుసంధానం ప్రాజెక్టుకుఅ వసరమయ్యే నిధులను సాయం చేయాలని ప్రధానిని జగన్ అభ్యర్ధించారని, ఆమేరకు నిధులు విడుదల చేయాలని విజయసాయి తన ప్రత్యేక ప్రస్తావనలో కోరారు.

admin1

admin1

Next Story