PM Narendra Modi call to CM Jagan : అగ్ని ప్రమాద ఘటనపై సీఎంకు ప్రధాని ఫోన్

PM Narendra Modi call to CM Jagan : విజయవాడ ఒక హోటల్లో అగ్ని ప్రమాద ఘటనపై పూర్త సమాచారం తెలుసుకోవడానికి గాను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఫోన్‌ చేశారు.

Sumitra
Updated on: 9 Aug 2020 11:12 AM IST
PM Narendra Modi call to CM Jagan : అగ్ని ప్రమాద ఘటనపై సీఎంకు ప్రధాని ఫోన్
X
ప్రధాని నరేంద్రమోది, సీఎం జగన్

PM Narendra Modi call to CM Jagan : విజయవాడ ఒక హోటల్లో అగ్ని ప్రమాద ఘటనపై పూర్త సమాచారం తెలుసుకోవడానికి గాను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఫోన్‌ చేశారు. దీంతో సీఎం సంఘటనకు సంబంధించిన వివరాలను ప్రధానికి తెలియజేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించామని ఈ సందర్భంగా సీఎం వెల్లడి చేసారు.

ఓ ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని, దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధాని మంత్రికి సీఎం తెలిపారు.




Sumitra

Sumitra

Next Story