ప్రసవం కోసం డోలీలో 5 కిలోమీటర్లు..

ప్రసవం కోసం డోలీలో 5 కిలోమీటర్లు..
x
Highlights

నాగరికత పెరిగింది. అభివృద్ధి సాధించాం. ఇదీ మనం చెప్పుకునే మాటలు. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు. ఇప్పటికీ కొద్దిపాటి వైద్యం కూడా అందని బతుకులు...

నాగరికత పెరిగింది. అభివృద్ధి సాధించాం. ఇదీ మనం చెప్పుకునే మాటలు. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు. ఇప్పటికీ కొద్దిపాటి వైద్యం కూడా అందని బతుకులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదివాసీల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. రోడ్డు సౌకర్యం చాలా గ్రామాలకు ఇప్పటికీ అందుబాటులో లేదు. దీంతో చిన్నపాటి అనారోగ్యానికి కూడా కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

తాజాగా ఓ మహిళకు ప్రసవ వేదన మొదలవడంతో ఆసుపత్రికి చేర్చడానికి 108 కూడా ఆ గ్రామానికి చేరలేని విధంగా రహదారి ఉండడంతో డోలీలో ఐదు కిలోమీటర్లు తీసుకువెళ్ళారు కుటుంబ సభ్యులు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా,వి.మాడుగుల మండలం కొత్తవలస గ్రామములో జనపరెడ్డి దేవి అనే గర్భిణీ స్త్రీకి అత్యవసర పరిస్థితి లో ప్రసవ సమయం కావటం తో హుటాహుటిన డోలీలో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది.

దాదాపు 5 కిలోమీటర్లు కుటుంబసభ్యులు గ్రామస్తులు కలసి డోలీలో తీసుకొని వచ్చారు.అక్కడ నుంచి 108 లో కేజే పురం ఆసుపత్రికి తరలించ్చారు.ప్రస్తుతం తల్లి,బిడ్డ క్షేమంగానే ఉన్నారు.

ఈ సందర్భంగా బాధితురాలి భర్త మాట్లాడుతూ రోడ్డు సదుపాయం లేక ఈ పరిస్థితి ఏర్పడిందని, కొంచెం ఉంటే తల్లి,పిల్ల ఇద్దరికి ప్రమాదం జరిగేదనీ చెప్పారు. తమకు వచ్చిన కష్టం వేరేవారికి ఎవ్వరికి రాకూడదని ఆయన అంటున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories