దమ్మున్న సీఎం జగన్: మంత్రి ధర్మాన

కఠిన నిర్ణయాలతోనే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

S. Srikanth
Published on: 14 Dec 2019 11:50 AM IST
దమ్మున్న సీఎం జగన్: మంత్రి ధర్మాన
X
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి ధర్మాన కృష్ణదాస్

నరసన్నపేట: కఠిన నిర్ణయాలతోనే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రూపొందించిన 'దిశ' బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

దేశంలో మహిళలపై దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని, వీటిని నివారించాలంటే కఠినమైన చట్టాలు అవసరమని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి నేరస్తులకు 21 రోజుల్లోనే శిక్ష విధించేలా చట్టం తేవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే సాధ్యమైందని చెప్పారు.


S. Srikanth

S. Srikanth

Next Story