Pothina Mahesh: పవన్‌కు బిగ్‌ షాక్‌.. జనసేనకు పోతిన మహేష్‌ రాజీనామా

Pothina Mahesh: పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేసిన పోతిన మహేష్‌

Jyothi
Published on: 8 April 2024 12:24 PM IST
Pothina Mahesh Resigned from Jana Sena
X

Pothina Mahesh: పవన్‌కు బిగ్‌ షాక్‌.. జనసేనకు పోతిన మహేష్‌ రాజీనామా

Pothina Mahesh: జనసేన పార్టీకి పోతిన మహేష్ షాకిచ్చారు. తనకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న మహేష్‌.. పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన పోతిన మహేష్‌.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆ‎శించారు. అయితే పొత్తుల కారణంగా బీజేపీ నేత సుజన చౌదరికి టికెట్ దక్కింది.

ఈ నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్నారు పోతిన మహేష్‌. భవిష్యత్ కార్యాచరణపై పలు దఫాలు కార్యకర్తలు, అనుచరులతో భేటీలు నిర్వహించిన ఆయన.. ఇవాళ పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story