AP Politics: కేశినేని, బుద్ధా వెంకన్న మధ్య పొలిటికల్ వార్

AP Politics: ఆట మొదలైంది సినిమా చూపిస్తానన్న బుద్దా వెంకన్న

Jyothi
Published on: 11 Jan 2024 10:34 AM IST
Political War Between Kesineni Nani and Buddha Venkanna
X

AP Politics: కేశినేని, బుద్ధా వెంకన్న మధ్య పొలిటికల్ వార్

AP News: ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేతల అలకలు, పార్టీ మార్పులతో ఎన్నికలకు ముందే అక్కడి పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఇక తాజాగా ఏపీ పాలిటిక్స్‌లో కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశమైది. విజయవాడ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి కేశినేని రాజీనామా చేశారు. సీఎం జగన్‌తో సమావేశం అనంతరం వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ ఫైర్ అయ్యారు. ఇక నుంచి తన ప్రయాణం జగన్‌తోనే అంటూ స్పష్టం చేశారు కేశినేని నాని. మరోవైపు కేశినేని కామెంట్లపై రియాక్ట్ అయ్యారు టీడీపీ నేతలు. కేశినేని మాటలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న.

రాజకీయ జీవితం కోసం చంద్రబాబుపై కేశినేని నాని ఇష్టానుసారం వ్యాఖ్యలు సరికాదంటూ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. చంద్రబాబు తనతో కేశినేని తిట్టించలేదని ఆయన కుటుంబసభ్యులపై ఒట్టేసి మరీ స్పష్టం చేశారు బుద్ధా వెంకన్న. కేశినేని గురించి బుద్ధా వెంకన్నతో.. చంద్రబాబు మాట్లాడించాల్సిన అవసరం లేదన్నారు. కేశినేని స్థాయి ఏంటి అంటూ ధ్వజమెత్తారు. కేశినేని నాని వైసీపీ కోవర్టు ఆరోపించారు బుద్ధా వెంకన్న.

అసలు ఏ ఎన్నికలోనూ కేశినేని నాని తన సొంత ఇమేజ్‌తో గెలిచిన దాఖలాలు లేవని.. రానున్న ఎన్నికల్లోనైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. వచ్చే ఎన్నికల్లో కేశినేని గెలిస్తే.. బుద్ధా భవన్‌ను వదులుకుంటానంటూ సవాల్ విసిరారు. తాను గెలిస్తే కేశినేని భవన్‌ను వదులుకోవాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నానికి, ఆయన సోదరుడు చిన్నికి ముందు నుండే గొడవలు ఉన్నాయని.. తమ్ముడి భార్యపైనే కేసులు పెట్టించాడని మండిపడ్డారు. రెండు సార్లు టికెట్ ఇచ్చిన చంద్రబాబు మోసగాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును.. కొడాలి నాని, వల్లభనేని వంశీ అన్ని మాటలు అంటుంటే.. టీడీపీలో ఉంటూ ఒక్కరోజైనా వాళ్ల మాటలు ఖండించావా అని కేశినేనిని నిలదీశారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడంటూ బుద్ధా ధ్వజమెత్తారు.

Jyothi

Jyothi

Next Story