Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగాం సురేశ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగాం సురేశ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Oct 2024 1:38 PM IST
Police Take Nandigam Suresh into Custody
X

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగాం సురేశ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగాం సురేశ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండ్రోజుల పాటు కస్టడీకి మంగళగిరి పోలీసులు అనుమతి ఇవ్వడంతో కాసేపటి క్రితం ఆయన్ను జైలుకు నుంచి తీసుకెళ్లారు. మరియమ్మ హత్యకేసులో మాజీ ఎంపీ నందిగాం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. కోర్టు ఆదేశాలతో నందిగాంను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కి తరలించనున్నారు.

కాగా, 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగడంతో.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story