శిబిరంలో ఉన్నవారిని గ్రామాలకు తరలిస్తున్న పోలీసులు

శిబిరంలో ఉన్నవారిని గ్రామాలకు తరలిస్తున్న పోలీసులు
x
Highlights

గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల శిబిరంలో ఉన్నవారిని పోలీసులు స్వగ్రామాలకు తరలిస్తున్నారు. మొత్తం ఐదు...

గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల శిబిరంలో ఉన్నవారిని పోలీసులు స్వగ్రామాలకు తరలిస్తున్నారు. మొత్తం ఐదు గ్రామాలకుచెందిన 200 మంది ఈ శిబిరంలో ఉన్నట్టు గుర్తించారు. అయితే, ప్రతి ఊరికీ ఒక బస్సును ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. ఈ రోజు ఉదయం నుంచీ శిబిరంలోకి ఎవరినీ పోలీసులు అనుమతించలేదు. చలో ఆత్మకూరు పిలుపు మేరకు అక్కడికి వచ్చిన టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న ఆర్టీవో భాస్కర్‌ రెడ్డి బాధితులతో సంప్రదింపులు జరిపారు. వారి సమస్య ఏంటి? ఎందుకు ఈ శిబిరానికి రావాల్సి వచ్చిందని ఆరాతీశారు. అనంతరం వారికి భద్రతాపరమైన హామీలు ఇవ్వడంతో పాటు వారిని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఒప్పించి వాంగ్మూలాలను సేకరించారు. తొలి విడతగా 35 మందిని వారి స్వగ్రామాలకు గ్రామాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. బస్సుల్లో ఎక్కించి వారి గ్రామాల్లో

ధైర్యంగా అడుగు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పోలీన్‌ పికెట్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు... వారంతా సాధారణ జీవనం సాగించేలా ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు స్తారంభించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories