Dornala: వలస కూలీలను రిలీఫ్ సెంటర్ కి తరలించిన పోలీసులు

S. Srikanth
Published on: 16 April 2020 11:39 AM IST
Dornala: వలస కూలీలను రిలీఫ్ సెంటర్ కి తరలించిన పోలీసులు
X
పెద్దదోర్నాల: కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండగల్లు గ్రామం నుండి 25 మంది గుంటూరు జిల్లా నరసరావుపేట పరిసర గ్రామాల్లో మిరప కోత నిమిత్తం గత నెల రోజుల క్రితం వచ్చారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో వారికి ఆ ప్రాంతంలో కూలిపని లేకపోవటంతో తిరిగి వారి ఊరికి వెళ్లే క్రమంలో దోర్నాల పోలీసులు వారిని గుర్తించి స్టేషన్ కు తరలించి వారిని పూర్తి స్థాయిలో విచారించి తాసిల్దార్ ఏ వి హనుమంత రావు ఆధ్వర్యంలో పెద్దదోర్నాల లోని సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కరోనా రిలీఫ్ సెంటర్కు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story