కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ ధనుంజయ

రానున్న సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యులు ఉంటాయని మండల ఎస్ఐ ధనుంజయ హెచ్చరించారు.

S. Srikanth
Published on: 11 Jan 2020 8:05 PM IST
కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ ధనుంజయ
X

ఎస్.రాయవరం: రానున్న సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యులు ఉంటాయని మండల ఎస్ఐ ధనుంజయ హెచ్చరించారు. ఎస్. రాయవరం, లింగరాజుపాలెం, వెంకటాపురం, సైతారుపేట, సర్వసిద్ది గ్రామాలలో శనివారం సాయంత్రం ఆయా గ్రామస్థులతో ఎస్ఐ సమావేశం నిర్వహించి, కోడి పందాలు, పేకాట, గుళ్ళాట తదితర జూదాలు నిర్వహిస్తే బైండోవర్ కేసులుతో పాటు, రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. మిగతా గ్రామాలలో ఆదివారం ప్రచారం నిర్వహిస్తామని ఎస్ఐ అన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story