Kuppam: టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి.. తిరగబడ్డ జనం.. వెనుదిరిగి వెళ్ళిపోయిన..

Kuppam: చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Published on: 4 Jan 2023 3:13 PM IST
Police Over Action on TDP Activists in Kuppam
X

Kuppam: టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి.. తిరగబడ్డ జనం.. వెనుదిరిగి వెళ్ళిపోయిన..

Kuppam: చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత నెలకొంది. గడ్డూరు క్రాస్ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లకుండా వారిని ఆపేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

వడ్డివాని‌ కొత్తూరు వద్ద టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి చేశారు. హరీష్ అనే వ్యక్తికి ముఖంపై రక్తపు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై తిరగబడ్డారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఆతర్వాత పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story