Pendurthi: విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసు అధికారులు

S. Srikanth
Published on: 8 April 2020 2:01 PM IST
Pendurthi: విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసు అధికారులు
X

పెందుర్తి: కూడలిలో జోన్ 2 ట్రాఫిక్ ఏసీపీ ఎం.ఆర్.కే.రాజు, పెందుర్తి ట్రాఫిక్ సిఐ ఉమాకాంత్, ట్రాఫిక్ ఎస్.ఐ భరత్ కుమార్ లా అండ్ ఆర్డర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్థానిక వైఎస్ఆర్ సీపీ నేత చిన్నఅప్పల నాయుడు వాహనం అటుగా వస్తుండడంతో దానిలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమంది ఉండడంతో గమనించి వాహనం ఆపి వారిని మందలించి పంపించడం జరిగింది.

ఈ సందర్భంగా జోన్ 2 ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ... ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు వాహనాలపై తిరుగుతున్నారని ఇలా జరిగితే రానున్న రోజుల్లో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని దీన్ని గుర్తించి ప్రజలు సామాజిక బాధ్యత తో దూరం పాటించాలని కోరారు.


S. Srikanth

S. Srikanth

Next Story