Yellamanchili: యలమంచిలిలో పకడ్బందీగా లాక్​డౌన్

సర్కిల్ పరిధిలో పోలీసులు లాక్​డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

S. Srikanth
Updated on: 9 April 2020 10:58 AM IST
Yellamanchili: యలమంచిలిలో పకడ్బందీగా లాక్​డౌన్
X

యలమంచిలి: సర్కిల్ పరిధిలో పోలీసులు లాక్​డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. యలమంచిలి సర్కిల్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లలో 600 ద్విచక్రవాహనాలపై కేసు నమోదు చేశారు.

రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు జిల్లాలోకి చొరబడకుండా గట్టి నిఘా చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలు రోడ్ల మీద రాకుండా కట్టడి చేస్తున్నారు. పోలీసుల సేవలను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story