రోడ్డున పడిన విద్యార్థులకు పోలీసుల సాయం

S. Srikanth
Published on: 24 March 2020 3:39 PM IST
రోడ్డున పడిన విద్యార్థులకు పోలీసుల సాయం
X
Police help students

పెదబయలు: కరోనా ప్రభావంతో పాఠశాలలకు సెలవు నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను కూడా ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పిన సంబంధిత అధికారులు వారికి తగు సౌకర్యాలు కల్పించకపోవడంతో రోడ్డున పడ్డారు. ఉదయం టిఫిన్‌ పెట్టకుండానే పంపేయడంతో బస్‌స్టాండ్‌కు చేరుకున్న విద్యార్థులు, తమ గ్రామాలకు వెళ్లేందుకు వాహనాలు కూడా లేకపోవడంతో రోడ్డుపైనే పడిగాపులు కాస్తూ ఆకలితో అలమటిస్తూ అవస్థలు పడ్డారు.

కొందరి చేతిలో డబ్బులున్నా, టిఫిన్‌ చేద్దామంటే లాక్‌డౌన్‌తో హోటల్స్‌, దుకాణాలు లేకపోవడంతో ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ పి.రాజారావు ఆధ్వర్యంలో పోలీసులు, వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి, ముందుగా అల్పాహారాన్ని పెట్టారు.


S. Srikanth

S. Srikanth

Next Story