Penukonda: అక్రమ ఇసుక రవాణా పై కేసు నమోదు

పెనుకొండ మండలం చెర్లోపల్లి లో దళితులు సాగుచేసుకుంటున్న శోత్రీయం భూముల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులను అడ్డుకున్నందుకు హరిజన నాగప్ప అనే రైతును అసభ్య పదజాలంతో దూషించారు.

S. Srikanth
Published on: 7 Feb 2020 12:12 PM IST
Penukonda: అక్రమ ఇసుక రవాణా పై కేసు నమోదు
X

పెనుకొండ: పెనుకొండ మండలం చెర్లోపల్లి లో దళితులు సాగుచేసుకుంటున్న శోత్రీయం భూముల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులను అడ్డుకున్నందుకు హరిజన నాగప్ప అనే రైతును అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో నాగప్ప తాసిల్దార్ నాగరాజు కు వినతి పత్రాన్ని అందజేశారు అలాగే గ్రామస్తులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై పోలీసు కేసు పెట్టారు. పోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేసినట్టు తెలియజేశారు. ఈ కేసు విషయమై ఎమ్మార్పీఎస్ పెద్దన్న మీడియాతో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్నదౌర్జన్యాలను ఖండిస్తూ ఎవరైతే దళితులపై దౌర్జన్యం చేస్తారో వారిపై ఎస్సి యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఆయన తెలియజేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story