జనతా కర్ఫ్యూ పై విస్తృత ప్రచారం

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ ధ్యేయంగా జనతా కర్ఫ్యూ పాటించాలని వివిధ శాఖల అధికారులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

S. Srikanth
Published on: 21 March 2020 7:23 PM IST
జనతా కర్ఫ్యూ పై విస్తృత ప్రచారం
X
Awareness to people on Janata curfew

ఓబులదేవరచెరువు: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ ధ్యేయంగా జనతా కర్ఫ్యూ పాటించాలని వివిధ శాఖల అధికారులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ ఐ కేఎం లింగన్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించకుండా ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని, జనతా కర్ఫ్యూ సూచనలు, సలహాలు పాటించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

అలాగే రెవిన్యూ, మెడికల్, పంచాయితీ తదితర అధికార సిబ్బంది కరోనా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా జనతా కర్ఫ్యూ ప్రకటనలో భాగంగా 22 వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గ్రామ స్థాయి నుండి మండల కేంద్రం ప్రజానీకం ఇళ్ళు వదిలి బయటికి రాకూడదని చాటింపు లతో వివిధ రకాలుగా విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ స్వర్ణలత, ఎంపీడీవో రఘునాథ్ గుప్తా, వైద్యాధికారి ఐనుద్ధీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గౌస్ మహమ్మద్, రామలింగారెడ్డి, చంద్రశేఖర్, కళ్యాణి, శ్రీకాంత్ తదితరులతోపాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story