Nara Lokesh: నారా లోకేష్‌ని అరెస్టు చేసిన పోలీసులు

* ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి లోకేష్ తరలింపు * నరసారావుపేటకు వెళ్లేందుకు వచ్చిన లోకేష్ * పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు

Sandeep Reddy
Updated on: 9 Sept 2021 1:10 PM IST
Police Arrested Nara Lokesh At Gannavaram Airport
X

నారా లోకేష్‌ని అరెస్టు చేసిన పోలీసులు (ట్విట్టర్ ఫోటో) 

Nara Lokesh: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద హైడ్రామా నడిచింది. నరసారావుపేటకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన టీడీపీ నేత లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి లోకేష్‌ను తరలించారు. ఇక లోకేష్‌కు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే లోకేష్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు.

టీడీపీ నేత నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేశ్ ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అక్కడి నుంచి ఆయనను ఎక్కడకు తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు నారా లోకేశ్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ పోలీసులు ఇప్పటికే గృహనిర్బంధం చేశారు. లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story