Ganja: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు

Ganja: ద్రవ రూపంలో మార్చి విక్రయించేందుకు ప్లాన్

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 2:31 PM IST
Police Arrest the Ganja Smugglers and Seize the 15 Lakh Worth Ganja
X
గంజాయిని ద్రవరూపంలోకి మర్చి విక్రయిస్తున్నా స్మగ్లర్లు 

Ganja: గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. ద్రవ రూపంలో గంజాయిని మార్చి విక్రయించేందుకు సరికొత్త ప్లాన్‌కు తెరలేపారు. విశాఖలో గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. 25కేజీల గంజాయిని ఆముదంతో కలిసి ద్రవ రూపంలో మార్చారు కేటుగాళ్లు. అయితే పక్కా సమాచారంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా కోదాడ వద్ద నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఐదుగురిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. నిందితుల వద్ద నుంచి సుమారు 15లక్షలు విలువ చేసే ద్రవ రూపంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అలాగే ఒక కారు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story