వై యస్ వివేకా హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు

వై యస్  వివేకా హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు
x
జిల్లా ఎస్పీ అన్బురాజన్
Highlights

మాజీ మంత్రి వై యస్ వివేకానంద హత్య కేసులో అనేక కోణాల్లో విచారణ చేస్తామని నిందితులను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

కడప: మాజీ మంత్రి వై యస్ వివేకానంద హత్య కేసులో అనేక కోణాల్లో విచారణ చేస్తామని నిందితులను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రైల్వేకోడూరు పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, వివేకానందరెడ్డి హత్య కేసును పూర్తి చేయడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేసి ఎస్సై, సీఐ సూచనలు సలహాలు ఇస్తున్నారన్నారు. ఏ పోలీసు స్టేషన్లో కూడా అవినీతికి తావులేకుండా చేస్తానన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో బాధితులకు అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావన్నారు. తమ దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తామన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories