Eluru: నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను పాటించకుండా భజన చేయడం సరికాదని పోలీసులు హెచ్చరించారు.

S. Srikanth
Published on: 25 March 2020 6:52 PM IST
Eluru: నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు
X

ఏలూరు: మండలంలోని జాలిపూడి గ్రామంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ కనీసం మాస్కులుకూడా ధరించకుండా గుడిలో చేరి భజన చేస్తూ మిగతాప్రజలను ఆహ్వానిస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

భజనలు చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గుడికి చేరుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను పాటించకుండా భజన చేయడం సరికాదని పోలీసులు హెచ్చరించారు.


S. Srikanth

S. Srikanth

Next Story