PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ

PM Modi: ఈనెల 23న ఉక్రెయిన్‌ వెళ్లనున్న ప్రధాని

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Aug 2024 2:24 PM IST
PM Modi Leaves For Poland and Ukraine Tour
X

PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ

PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో పొలాండ్‌లో ప్రధాని బస చేయనున్నారు. భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ పర్యటనకు వెళుతున్నారు. మధ్య ఐరోపాలో భారత్ కు కీలక ఆర్ధిక భాగస్వామిగా పోలాండ్ ఉంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడు, ప్రధానులతో మోడీ సమావేశం కాబోతున్నారు.

అనంతరం పోలాండ్‌లో ఉన్న ప్రవాస భారతీయులను ప్రధాని కలవబోతున్నారు. వారితో కలిసి ఓ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కాగా, భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల పోలాండ్ పర్యటన అనంతరం 23న మోడీ ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం గమనార్హం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story