Perni Nani: అలిపిరి ఘటన డ్రామానా చంద్రబాబు?

Perni Nani: చంద్రబాబుపై పేర్నినాని మరోసారి విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Updated on: 15 April 2023 9:30 PM IST
Perni Nani Slams Chandrababu
X

Perni Nani: అలిపిరి ఘటన డ్రామానా చంద్రబాబు?

Perni Nani: చంద్రబాబుపై పేర్నినాని మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్‌పై కత్తితో దాడి జరిగితే.. వాళ్లే కావాలని చేయించుకున్నారని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోపలికి కత్తి ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వెల్లడించాలని అప్పట్లో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు. ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా? అని అన్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద బ్లాస్ట్ జరిగినప్పుడు వైఎస్ఆర్ వెళ్లి పరామర్శించారని... దాడి ఖండించారని చెప్పారు. చంద్రబాబుకు, వైఎస్ కుటుంబానికి మధ్య తేడా ఈ ఒక్క విషయంతోనే తెలిసిపోయిందని పేర్ని నాని అన్నారు. అయితే, అలిపిరి ఘటన కూడా డ్రామానా చంద్రబాబు?. తీవ్రవాదులకు స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారో చంద్రబాబుకు కూడా కొన్ని వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారని నాని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story