Perni Nani: కలెక్టర్ రాలేదని ఆగ్రహం.. సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేసిన పేర్నినాని

Perni Nani: సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌

Shekhar G
Published on: 20 July 2023 4:52 PM IST
Perni Nani Complained To CS For Collector
X

Perni Nani: కలెక్టర్ రాలేదని ఆగ్రహం.. సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేసిన పేర్నినాని

Perni Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ మధ్య వివాదం తాడేపల్లికి చేరింది. ఇవాళ సెక్రెటరియేట్లో సీఎస్ జవహర్‌రెడ్డిని పేర్నినాని కలిశారు. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి కలెక్టర్, ఉన్నతాధికారులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని. ఈ విషయంపై ఇవాళ సీఎస్‌ను కలిశారు. జెడ్పీ సమావేశానికి కలెక్టర్‌ రాకపోవడంపై పేర్ని నాని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే కలెక్టర్‌పై ఫిర్యాదు చేయడం లేదంటున్నారు పేర్ని నాని. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందనే విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇక పేర్ని నాని సీఎస్‌ను కలిసిన అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్‌కు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపువచ్చింది. దాంతో క్యాంప్ ఆఫీస్‌లో సీఎస్‌ను కలిశారు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్. జెడ్పీ సమావేశాలకు హాజరు అంశంపై సీఎస్‌కు ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story