కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు సహకరించాలి: ఎమ్మెల్యే

కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోలగట్ల వీర భద్ర స్వామి అన్నారు.

S. Srikanth
Published on: 24 March 2020 6:14 PM IST
కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు సహకరించాలి: ఎమ్మెల్యే
X
Korugantla Veerabadhra Swamy

విజయనగరం: కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోలగట్ల వీర భద్ర స్వామి అన్నారు. తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలు స్వచ్ఛందంగా మీమీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం అన్ని వ్యవస్థలను మూసివేసిందని, తల్లిదండ్రులు మీ పిల్లలకు బైక్ లు ఇచ్చి రోడ్లు పైకి వదల వద్దని కోరారు.

పట్టణంలోని 50 వార్డుల కి 50 పిచికారీ మిషన్లు, మందులు అందచేస్తున్నామని తెలిపారు. ఉగాదికి ప్రజల ఇబ్బంది పడకుండా బెల్లం, మామిడి కాయ, వేప పువ్వు ఉచితంగా అందించాలని మా పార్టీ నాయకులకి సూచించామన్నారు.హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా ప్రదాని మోడీ కఠిన చర్యలు తీసుకోవడాన్ని తప్పు బట్ట వద్దని...పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. పోలీసుల విధులకు ఎవరూ అడ్డంకులు సృష్టించ వద్దని...అత్యవసర సమయాల్లో తనకి కాల్ చేసి సంప్రదించవచ్చునని స్పష్టం చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story