అన్యాయంగా ఫించన్లు రద్దు చేశారంటూ ధర్మవరం గ్రామస్థులు ఆవేదన

అన్యాయంగా ఫించన్లు రద్దు చేశారంటూ ధర్మవరం గ్రామస్థులు ఆవేదన
x
Highlights

రద్దు చేసిన వృధ్ధాప్య ఫించన్లను పునఃరుద్దరిచాలని మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన వృధ్ధులు మాజీ ఉప సర్పంచి సియ్యాదుల అచ్యుత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందించారు.

ఎస్.రాయవరం: రద్దు చేసిన వృధ్ధాప్య ఫించన్లను పునఃరుద్దరిచాలని మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన వృధ్ధులు మాజీ ఉప సర్పంచి సియ్యాదుల అచ్యుత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందించారు. గ్రామానికి చెందిన సుమారు 27 మందికి వృధ్ధాప్య ఫించన్లు నిలిచిపోయాయి. వారంతా గ్రామ వాలంటీర్లను అడుగుగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నందున ఫించన్లు రద్దయ్యాయని కారణం చెప్పారన్నారు.

కానీ తాము ఎటువంటి ఆదయపు పన్ను చెల్లింపుదారులము కాదని తమ విజ్ఞాపనలో పేర్కొన్నారు. తామంతా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ఫించను పొందుతూ జీవనం గడుపుతున్నామని, ఇప్పుడు అర్ధంతారంగా అనర్హులుగా ఫించను రద్దు చేయడంపై ఆవేదన చెందుతున్నారు. విచారణ జరిపించి తిరిగి ఫింఛన్లు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి ఆంజనేయులు, రాయి అప్పారావు, కలిగట్ల వరహాలమ్మ, శీలం వరలక్ష్మీ, మొగ్గా జోగరత్నం, సుంకర నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories