Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న పవన్

Pawan Kalyan: సచివాలయానికి వెళ్లేదారిలో పవన్ కల్యాణ్‌కి భారీ స్వాగతం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 18 Jun 2024 10:00 PM IST
Pawan will take charge as Deputy CM tomorrow
X

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న పవన్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన... నేరుగా విజయవాడలోని జలవనరులశాఖ అతిథిగృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్‌ పరిశీలించారు. పైఅంతస్తులో నివాసం... కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్‌ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్‌ పరిశీలించేందుకు వెళ్లగా... అమరావతి రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా పువ్వులు వేస్తూ పవన్‌కు స్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్... సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇక పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story