Love Marriage: ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె.. బతికుండగానే కర్మకాండలు చేసిన తల్లిదండ్రులు

Love Marriage: ఇల్లు వదిలి ప్రియుడితో లేచిపోయిందని ఓ కుటుంబం బతికున్న కూతురుకి ఖర్మ కాండ నిర్వహించింది.

Arun Chilukuri
Updated on: 16 Jun 2023 7:15 PM IST
Parents Conduct Death Rituals After Daughter Elopes in Kurnool District
X

Love Marriage: ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె.. బతికుండగానే కర్మకాండలు చేసిన తల్లిదండ్రులు

Love Marriage: ఇల్లు వదిలి ప్రియుడితో లేచిపోయిందని ఓ కుటుంబం బతికున్న కూతురుకి ఖర్మ కాండ నిర్వహించింది. కూతురు చనిపోయిందని ఇంట్లో ఓ కుర్చీలో కూతురు ఫోటోకి పూలమాలవేసి టెంకాయ కొట్టి బాధతో రోధించింది. కర్నూలు జిల్లా హనుమాపురం గ్రామానికి చెందిన పెద్ద నాగన్న, ఉరుకుందమ్మ కుమార్తె ఇందు ఎమ్మిగనూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన యువకుడు మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 7వ తేదీ రాత్రి పెద్దలకు చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెద్దకడబూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూతురు తిరిగి రాకపోవడంతో బాధను వ్యక్త పరుస్తూ కూతురుకి తల్లి,తండ్రి, చెల్లెలు ముగ్గురు కలసి వీడియో చిత్రీకరిస్తూ ఖర్మ కాండ నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story