YS Jagan: వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్

Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో EVMల బదులు బ్యాలెట్ పేపర్‌ వాడాలన్నారు.

Arun Chilukuri
Updated on: 18 Jun 2024 10:46 AM IST
YS Jagan: వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్
X

Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో EVMల బదులు బ్యాలెట్ పేపర్‌ వాడాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ.. బ్యాలెట్ పేపర్ వాడుతున్నారని ప్రస్తావించారు. భారత్‌లోనూ బ్యాలెట్ పేపర్ వాడాలని.. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలని ట్వీట్‌లో రాసుకొచ్చారు.. జగన్‌.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని.. 'మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ఈవీఎంల బదులు పోస్టల్‌ బ్యాలెట్లను ఉపయోగించాలి' అంటూ ట్వీట్ చేశారు. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story