రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు

Orders Appointing SPs for 26 Districts In The State
x

రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు

Highlights

AP Districts SPs: రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

AP Districts SPs: రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్ నియమించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక ,విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగిస్తున్నారు. పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు, అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి, అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్ , కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి , పశ్చిమ గోదావరి జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌, ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డిని నియమించారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా, గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగుతారు.

పల్నాడు జిల్లా ఎస్పీగా రవి శంకర్ రెడ్డి బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ నియమించగా... ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గర్గ్ , నెల్లూరు జిల్లా ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగుతారు. తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి , చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి, అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు నియమించారు. కడప ఎస్పీగా అన్బూరాజన్‌, అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగుతారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌, కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి , నంద్యాల జిల్లా ఎస్పీగా కె.రఘువీరారెడ్డి నియమితులయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories