ఏపీలో రాజీనామా చేయండి అంటున్న అధికారులు.. వారి నిర్వాకంతో నివ్వెరపోతున్న వార్డు సచివాలయ ఉద్యోగులు

ఏపీలో రాజీనామా చేయండి అంటున్న అధికారులు.. వారి  నిర్వాకంతో నివ్వెరపోతున్న వార్డు సచివాలయ ఉద్యోగులు
x
Highlights

దరఖాస్తులు ఆహ్వానించారు.. పరీక్షలు నిర్వహించారు.. ఫలితాలూ విడుదల చేశారు.. మీరు ఎంపిక అయ్యారంటూ ఉత్తర్వులూ ఇచ్చారు.. ఆనక తాపీగా ఈ ఉద్యోగాలకు మీరు...

దరఖాస్తులు ఆహ్వానించారు.. పరీక్షలు నిర్వహించారు.. ఫలితాలూ విడుదల చేశారు.. మీరు ఎంపిక అయ్యారంటూ ఉత్తర్వులూ ఇచ్చారు.. ఆనక తాపీగా ఈ ఉద్యోగాలకు మీరు అనర్హులు.. వెంటనే రాజీనామా చేయండి అంటూ హుకం జారీ చేశారు. దీంతో ఆ అభ్యర్థులు అవాక్కయ్యారు. నోటి కాదా కూడు తీసేస్తున్న అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాలివీ..

ఆంద్రప్రదేశ్ గ్రామ సచివాలయ వ్యవస్థకు వివిధ ఖాళీలను పూరించడానికి ప్రభుత్వం ఇటీవల కసరత్తులు పూర్తి చేసింది. దరఖాస్తు చేసుకున్నవారేరికి పరీక్ష నిర్వహించి.. అందులో ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు ఇచ్చింది. ఇప్పుడు వారిలో వార్డు సచివాలయ సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌-2) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలు సరైనవి కావని చెబుతూ ఆయా ఉద్యోగాల్లో చేరిన వారిని రాజీనామా చేయమని అధికారులు కోరుతున్నారు. నిజానికి డిగ్రీ లేదా ఆపై చదివినవారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ పోస్టులకు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీంతో బీకాం, బీఈడీ, ఆర్ట్స్ అండ్‌ హ్యుమానిటీస్‌ చదివినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని చాలా ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు.. బీకాం, బీఈడీ డిగ్రీలను ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌గా గుర్తిస్తున్నాయి. ఈ కారణంగా ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు అధికారులు బీకామ్, బీఎడ్ విద్యార్థులు ఈ నియామకాలకు కుదరదని చెబుతున్నారు. విద్యార్హతల విషయంలో గందరగోళం తో ఉద్యోగాలు ఇచ్చిన తరువాత వారిని రాజీనామా చేయాలనీ ఒత్తిడి చేస్తున్నారు.

తాము ఆ పోస్టులకు అనర్హులమైతే పరీక్ష ఎందుకు రాయించారని అధికారుల తీరును ఆ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు సోమవారామ్ సచివాలయం వద్ద తమ గోడును విలేకరులకు వెళ్ళ బోసుకున్నారు. కష్టపడి చదివి ఉద్యోగానికి ఎంపికైనట్లు నియామక పత్రాలు అందుకున్న తర్వాత తొలగించడం దారుణమని.. అధికారుల కారణంగా తాము ఉద్యోగాలను కోల్పోతున్నామని వాపోయారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని.. మొరపెట్టుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories