Penukonda: వేరుశెనగ విత్తన కాయల పరిశీలన

admin1
Published on: 17 March 2020 8:53 AM IST
Penukonda: వేరుశెనగ విత్తన కాయల పరిశీలన
X
Officers Inspecting the groundnut crop

పెనుకొండ: నియోజకవర్గం రుద్దం మండలంలో వ్యవసాయ బోరుబావుల కింద వేసిన వేరుశనగ పంటలను అధికారులు పరిశీలించారు. సోమవారం మండలంలోని పెద్దపల్లి, తురకల పట్నం, బొక్కసం పల్లి, గ్రామాల్లో ఆయా రైతుల పొలాల్లో వేరుశనగ పంటలను తొలగించి దిగుబడి తీసిన రైతుల వద్దకు అధికారులు ఏవో ఆదినారాయణ వెళ్లి కాయలను పరిశీలించారు. అదేవిధంగా రైతులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీడ్స్ అధికారుల ద్వారా నాణ్యమైన వేరుశెనగ విత్తన కాయలు కొనుగోలు చేపట్టారు. ఏపీ సీడ్స్ ద్వారా మండలంలోని పెద్దపల్లి, బొక్కసం పల్లి, తురకల పట్నం, సాని పల్లి, గ్రామాలకు చెందిన రైతులకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

admin1

admin1

Next Story