Gandlapenta: హౌసింగ్ కాలనీ స్థలాలను పరిశీలించిన అధికారులు

మండల కేంద్రం సమీపంలో ఉగాది కి ఇచ్చే ఇంటి స్థలాలను ఏపీ డి విజయ్ కుమార్ పరిశీలించారు.

admin1
Published on: 17 March 2020 7:21 AM IST
Gandlapenta: హౌసింగ్ కాలనీ స్థలాలను పరిశీలించిన అధికారులు
X

గాండ్లపెంట: మండల కేంద్రం సమీపంలో ఉగాది కి ఇచ్చే ఇంటి స్థలాలను ఏపీ డి విజయ్ కుమార్ పరిశీలించారు. హౌసింగ్ కాలనీ కోసం జరుగుతున్న పనులను, చేయాల్సిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణ, ఎంపీడీవో శ్రీరాములు, హౌసింగ్ ఏఈ షామీర్ భాష, సర్వేయర్ రెడ్డప్ప, ఏపీఓ హారూన్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

admin1

admin1

Next Story