Srisailam: శ్రీశైలంలో ఎలుగుబంటిని బంధించిన అధికారులు

Srisailam: వెలుగోడు అటవీప్రాంతంలో వదిలేయనున్న అధికారులు

Shekhar G
Published on: 18 Aug 2023 9:04 AM IST
Officers Captured A Bear In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ఎలుగుబంటిని బంధించిన అధికారులు

Srisailam: శ్రీశైలం శిఖరంలో ఇటీవల చిరుత, ఎలుగుబంటి సంచరించిన ప్రదేశాలను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిశీలించారు. స్వయంగా స్థానిక అటవీశాఖ రేంజర్ నరసింహులుతో పాటు సిబ్బంది చిరుతపులి, ఎలుగుబంటి తిరిగిన ప్రదేశాలను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణులు తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఇక ఎలుగుబంటిని పట్టుకునేందుకు శిఖరం వద్ద మూడు ప్రత్యేక బొన్లు ఏర్పాటు చేశారు. బొన్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులతో మాట్లాడారు. అటు నుంచి శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరించిన ప్రదేశాల్లో పరిశీలించి.. రేంజర్ నరసింహులుకు వైల్డ్ లైఫ్ రెస్క్యూ సిబ్బందికి అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ తగిన సలహాలు సూచనలు చేశారు. అయితే ఇప్పటికే జంతువులు క్షేత్రపరిధిలోకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని... త్వరలో టెండర్‌లకు పిలుస్తామని శ్రీశైలం దేవస్థానం స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story