ఇంటర్ గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్ గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
x
Highlights

దొరవారిసత్రం, కోట ప్రాంతాల్లోని బీసీ గురుకుల కళాశాలల్లో జూనియర్ ఇంటర్ (బాలురు) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని, మంగళ వారం ఆఖరి తేదీని స్థానిక కళాశాల ప్రిన్సిపల్, గురుకులాల కన్వీనర్ పి.మాధవయ్య తెలిపారు.

దొరవారిసత్రం: దొరవారిసత్రం, కోట ప్రాంతాల్లోని బీసీ గురుకుల కళాశాలల్లో జూనియర్ ఇంటర్ (బాలురు) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని, మంగళ వారం ఆఖరి తేదీని స్థానిక కళాశాల ప్రిన్సిపల్, గురుకులాల కన్వీనర్ పి.మాధవయ్య తెలిపారు. ఆయన విలేకరులతో మాధవ్ మాట్లాడుతూ... వైఎస్ఆర్ జిల్లా నందలూరు బీసీ జూనియర్ ఇంటర్ (బాలికలు)లో ప్రవేశానికి, మంగళవారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 8న ఆయా కళాశాలల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

దొరవారిసత్రం, కోట గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయని, ఒక్కో గ్రూపులో 40 సీట్లున్నట్లు చెప్పారు. 'డబ్ల్యూడబ్యూడబ్ల్యూ. జన్మభూమి. ఏపీ. జిఓవీ. ఇన్' వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాలుగు జతల యూనిఫాం, ఒక బ్లాంకెట్, రెండు జతల బూట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు తదితరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9866559644 (దొరవారిసత్రం), 9866559643 కోట నంబర్లు సంపాదించాలని సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories