ఏపీ ప్రభుత్వానికి మరోసారి NHRC నోటీసులు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి NHRC మరోసారి నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 25 Nov 2021 6:26 PM IST
NHRC Issued Notice to Andhra Pradesh Government
X

ఏపీ ప్రభుత్వానికి మరోసారి NHRC నోటీసులు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి NHRC మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపధ్యంలో వాటిపై నివేదిక ఇవ్వాలని గతంలోనే NHRC నోటీసులు ఇచ్చింది. అయితే వాటికి ఏపీ ప్రభుత్వం స్పందించలేదు తాజాగా మరోసారి నోటీసులిచ్చిన NHRC రిప్లయ్ ఇవ్వకపోతే తాము తీసుకునే చట్టబద్ధ చర్యలకు సిద్ధపడాలంటూ హెచ్చరించింది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు ఎక్కువవుతుండటం పట్ల NHRC కి కంప్లయింట్స్ వచ్చాయి. ఆ నేపధ్యంలోనే ఏపీకి నోటీసులు జారీ చేసినా ఇప్పటి వరకూ రిప్లయ్ ఇవ్వలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story