‘తల్లికి వందనం’ స్కీమ్‌లో అప్డేట్: రేపే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ! పేమెంట్ స్టేటస్ చెక్ చేయడమెలా?

‘తల్లికి వందనం’ స్కీమ్‌లో అప్డేట్: రేపే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ! పేమెంట్ స్టేటస్ చెక్ చేయడమెలా?
x

‘తల్లికి వందనం’ స్కీమ్‌లో అప్డేట్: రేపే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ! పేమెంట్ స్టేటస్ చెక్ చేయడమెలా?

Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం రెండో విడత నగదు జమ రేపే (జూలై 10)! ఎవరికెవరికికి డబ్బులు వస్తాయో? పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

తల్లికి వందనం పథకం అప్డేట్: జూలై 10న తల్లుల ఖాతాల్లోకి నగదు జమ – పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో కీలకమైన ‘తల్లికి వందనం’ (Amma Vandanam) పథకం రెండో విడత నగదు జమకు రంగం సిద్ధమైంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, జూలై 10న లబ్ధిదారుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

రెండో విడతలో ఎవరికెవరికీ డబ్బులు?

  • మొదటి తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు
  • కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, CBSE సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు
  • మొదటి విడతలో చెల్లింపులు రాకపోయిన తల్లులు
  • ఇటీవల ఫిర్యాదు చేసి అర్హులుగా తేలిన వారు

ఈ విడతలో మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లులకు డబ్బులు జమ కానున్నాయి. ఇందులో 7.99 లక్షల మంది విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తించబడి, రూ.13 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

డబ్బుల పంపిణీ విధానం:

  • మొత్తం రూ.15,000 లబ్ధిలో
  • రూ.13,000 తల్లి ఖాతాలోకి
  • రూ.2,000 జిల్లా కలెక్టర్ ఖాతాలోకి జమ అవుతుంది

తల్లికి వందనం పథకానికి అర్హతలు:

  • తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించరాదు
  • ఇంట్లో ఫోర్ వీలర్ లేకూడదు (ట్రాక్టర్, ఆటో మినహాయింపు)
  • ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కావు
  • 75% హాజరు ఉండాలి
  • ఆధార్ లింక్‌డ్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి

స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే:

👉 వెబ్‌సైట్: https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

👉 స్కీమ్ లిస్ట్ నుంచి 'తల్లికి వందనం' ఎంచుకోండి

👉 సంవత్సరం: 2025-2026 ఎంచుకోవాలి

👉 ఆధార్ నెంబర్ నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి

👉 Get OTP క్లిక్ చేసి, మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి Submit చేయండి

👉 మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది

Show Full Article
Print Article
Next Story
More Stories