Srisailam: శ్రీశైలంలో మల్లన్న భక్తుల కోసం నూతన వసతి గృహం.. 220 గదులతో గణేష్ సదన్ నిర్మాణం

Srisailam: వచ్చే నెల సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం

Shekhar G
Published on: 8 Aug 2023 7:20 AM IST
New Rooms  For Mallanna Devotees In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో మల్లన్న భక్తుల కోసం నూతన వసతి గృహం.. 220 గదులతో గణేష్ సదన్ నిర్మాణం

Srisailam: శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాదిమంది భక్తులు ఆలయానికి వస్తారు. అయితే దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయాధికారులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు వసతి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. భక్తుల కోసం దేవస్థాన పరిధిలో 50 కోట్లతో నూతన వసతి గృహాన్ని నిర్మించారు. 220 గదులతో గణేష్ సదన్ వసతి గృహాన్ని నిర్మించారు.

2018లో గణేష్ సదన్ వసతి గృహ నిర్మాణం కోసం 50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాన్ని చేపట్టగా, ఈ వసతి గృహంలో 220 గదులు, 6 దుకాణాలు, భక్తులపై అంతస్తులకు వెళ్లడానికి లిఫ్టును ఏర్పాటు చేశారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ వసతి గృహం....వచ్చే నెలలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ వసతి గృహం అందుబాటులోకి వస్తే భక్తులకు వసతి సమస్యలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story