Top
logo

తిరుమలలో లగేజీ భద్రపరుచుకోవడానికి కొత్త విధానం

తిరుమలలో లగేజీ భద్రపరుచుకోవడానికి కొత్త విధానం
Highlights

తిరుమలలో యాత్రీకులు తమ లగేజీని భద్రపరుచుకోవడానికి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

(తిరుమల హెచ్ ఎం టీవీ ప్రతినిధి)

శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ‌వచ్చే లక్షలాది సామన్యభక్తుల సౌకర్యార్ధం ఉచిత లగేజీ, మెబైల్ ఫోన్ డిపాజిట్-రిసివింగ్ విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు అదనపు కౌంటర్లును ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు....గతేడాది బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఎదుర్కున్న ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని ఇకపై లగేజ్, సెల్ ఫోన్లు డిపాజిట్ చేసేటప్పుడే తిరిగి రిసివింగ్ ఎక్కడ చేసుకోవాలో తెలిపేలా బార్ కోడ్ టోకన్లు జారీ చేస్తామని..అలాగే తమ లగేజ్ కౌంటర్ కు చేరుకుందో-లేదో అనేది భక్తులకు తెలుసుకునేలా ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక యాంత్రం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు...ముఖ్యంగా గరుడసేవ నాడు భక్తులు ఏలాంటి ఇబ్బందులు పడ్డాల్సిన పనిలేకుండా కేవలం నిమిషాల వ్యవధిలోనే వారి లగేజీని, మొబైల్ ఫోన్ తిరిగి పొందేందుకు 11 నుండి 30 కౌంటర్లకు పెంచమని చెప్పారు.

Next Story