విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం.. వ్యాక్సిన్ వేయిస్తామని పురిటి బిడ్డతో...

Visakhapatnam: కింగ్‌జార్జి ఆస్పత్రి సూపరింటెండెంట్ మైథిలీ పోలీసులకు ఫిర్యాదు...

Shireesha
Published on: 17 March 2022 9:56 AM IST
New Born Baby Kidnap in King George Hospital Visakhapatnam Today 17 03 2022 | AP News
X

విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం.. వ్యాక్సిన్ వేయిస్తామని పురిటి బిడ్డతో...

Visakhapatnam: విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో పురిటిబిడ్డ అదృశ్యమైంది. ఆనందపురంకు చెందిన అప్పాయమ్మ చిన్నారికి జన్మనిచ్చింది. ఆస్పత్రిలో పురుడు పోసుకున్న తర్వాత నిన్న డిశ్చార్జి చేశారు. బయలు దేరి ఇంటికెళ్తున్న నేపథ్యంలో ఓ మహిళ వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పి పురిటిబిడ్డను పట్టుకెళ్లి తిరిగి రాలేదు. బిడ్డ అదృధ్యమైన ఆస్పత్రి సూపరింటెండెంట్ మైథిలీకి సమాచారమందించారు.

బిడ్డ కన్పించడంలేదని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి అధికారుల ఫిర్యాదుతో పోలీసులు గాలిస్తున్నారు. వ్యాక్సిన్ వేయిస్తామన్న మహిళ ఆటోలో గురుద్వార్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుండి గోపాలపట్నం వైపు వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story