Visakhapatnam: 20 నుంచి సాంకేతిక అంశాలపై జాతీయ సదస్సు

పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని సత్ఫలితాలు సాధించేందుకు జాతీయ సాంకేతిక సదస్సు.

S. Srikanth
Published on: 13 Feb 2020 1:30 PM IST
Visakhapatnam: 20 నుంచి సాంకేతిక అంశాలపై జాతీయ సదస్సు
X

విశాఖపట్నం: పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని సత్ఫలితాలు సాధించేందుకు జాతీయ సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నట్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ (.ఐ.ఆర్‌.ఎల్‌) డైరెక్టర్‌ (పర్సనల్‌) కె.సి.దాస్‌ అన్నారు. బీచ్‌రోడ్డు పామ్‌బీచ్‌ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీచ్‌రోడ్డు గేట్‌వే హోటల్లో ఈనెల 20, 21 తేదీల్లో కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా విశాఖ చాప్టర్‌ ఆధ్వర్యంలో వార్షిక జాతీయ సదస్సు (ఎపిక్‌ -2020) పేరుతో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

దేశ వ్యాప్తంగా సుమారు 300 మంది వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారన్నారు. సదస్సు కన్వీనర్‌ బి.గోవర్థన్‌రెడ్డి, స్టీల్‌ప్లాంట్‌ ఐటీ విభాగం సీజీఎం కె.వి.ఎస్‌.ఎస్‌.రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story