Yanamala: చంద్రబాబు అరెస్టు‌ను జాతీయ నేతలు ఖండించారు

Yanamala: తప్పుడు కేసులో ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోంది

Shekhar G
Published on: 18 Sept 2023 2:47 PM IST
National Leaders Have Condemned Chandrababu Arrest Says Yanamala Rama Krishnudu
X

Yanamala: చంద్రబాబు అరెస్టు‌ను జాతీయ నేతలు ఖండించారు

Yanamala: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా కేసులో ఇరికించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసులో ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోందని చెప్పారు. జైలులో ఆయన సంతోషంగా లేరని.. పార్టీ కార్యకర్తల గురించి అడిగారన్నారు. చంద్రబాబు ఎప్పుడు భవిష్యత్ గురించే ఆలోచిస్తారని అన్నారు. చంద్రబాబు అరెస్టును అనేకమంది జాతీయ నేతలు ఖండించారని తెలిపారు. సంఘీభావం తెలిపిన జాతీయ నేతలు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పమన్నారని యనమల చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story