Narsipatnam: వలస కూలీలను స్వగ్రామాలకు తరలిస్తున్నాం

శ్రీకాకుళానికి చెందిన వలస కూలీలు హైదరాబాదు, నెల్లూరు నుంచి నడిచి వస్తున్నారని, వీరిని పాయకరావుపేటలో గుర్తించి, మూడు ఆర్టీసీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు తరలించామని ఆర్డీఓ కె.లక్ష్మీశివజ్యోతి తెలిపారు.

S. Srikanth
Published on: 14 April 2020 8:16 AM IST
Narsipatnam: వలస కూలీలను స్వగ్రామాలకు తరలిస్తున్నాం
X
RDO Lakshmi Siva Jyothi
నర్సీపట్నం: శ్రీకాకుళానికి చెందిన వలస కూలీలు హైదరాబాదు, నెల్లూరు నుంచి నడిచి వస్తున్నారని, వీరిని పాయకరావుపేటలో గుర్తించి, మూడు ఆర్టీసీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు తరలించామని ఆర్డీఓ

కె.లక్ష్మీశివజ్యోతి తెలిపారు. ఆమె విలేకర్లతో మాట్లాడుతూ... తహసీల్దార్లు వెంటనే స్పందించి వీరికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారని ఆమె తెలిపారు. నర్సీపట్నంలోని రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ప్రజలకు వాలంటీర్ల ద్వారా అన్నీ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ నెల ఆరో తేదీన ఇక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు బయట పడ్డాయని గుర్తుచేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 28 రోజుల పాటు అంటే మే నాలుగో తేదీ వరకు సంబంధిత ప్రాంతాలు రెడ్‌జోన్‌గా కొనసాగుతాయన్నారు. మళ్లీ ఏదైనా పాజిటివ్‌ బయటపడితే ఆ రోజు నుంచి మరో 28 రోజులు జోన్‌ను పొడిగిస్తారన్నారు. ఇప్పటివరకు మిగతా అనుమానిత కేసులన్నీ పరీక్షల్లో నెగిటివ్‌గానే నమోదయ్యాయన్నారు. దీనివల్ల ప్రస్తుతం ఏ ఇబ్బంది లేదన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story