S.Rayavaram: దుకాణాల వద్ద నిబంధనల్ని పరిశీలించిన ఏఎస్పీ

అడ్డురోడ్ లోని నూతనంగా ఏర్పాటు చేయబడిన మాంసం, చేపలు, పళ్ళ దుకాణాల ప్రాంగణాన్ని నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు.

S. Srikanth
Published on: 5 April 2020 6:58 PM IST
S.Rayavaram: దుకాణాల వద్ద నిబంధనల్ని పరిశీలించిన ఏఎస్పీ
X

ఎస్.రాయవరం: అడ్డురోడ్ లోని నూతనంగా ఏర్పాటు చేయబడిన మాంసం, చేపలు, పళ్ళ దుకాణాల ప్రాంగణాన్ని నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేందుకు, దుకాణాలన్నిటినీ పాత హైవే రోడ్ లోని తిమ్మాపురం పంచాయితీ సమీపానికి తరలించిన సంగతి తెలిసిందే.

ఇక్కడ దుకాణాల సామాజిక దూరం సక్రమంగా అమలవడం పట్ల ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా నిబంధనలకు విరుధ్ధంగా మాస్కులు లేకుండా, పరిమితికి మించి తిరుగుచున్న 50 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 3 బైకులు సీజ్ చేశామని ఎస్ఐ ధనుంజయ తెలిపారు. అలాగే రూ.45 వేలు ఫైన్ విధించామని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి సిఐ విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story