Narasapuram: ఎంపీడీఓ మిస్సింగ్.. విషాదాంతం..

Narasapuram: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 July 2024 4:21 PM IST
Narasapuram MPDO Deadbody Found in Eluru Canal
X

Narasapuram: ఎంపీడీఓ మిస్సింగ్.. విషాదాంతం..

Narasapuram: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. వెంకటరమణారావు మృతదేహాన్ని ఎస్‌డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది. ఏలూరు కాలువలో తూటి కాడ మధ్య మృతదేహం ఇరుక్కుని ఉంది దీంతో పోలీసులు బయటకు తీశారు. గత పాలకుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

సెల్ లొకేషన్ మిస్ అయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. వెంకటరమణారావు మృతదేహాన్ని ఎస్‌డీఆర్ఎఫ్ బృందం గుర్తించి అధికారికంగా ధృవీకరించింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసి ఎంపీడీవో కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story