ఓటేసిన వారినే జగన్ కాటేస్తున్నారు : నారా లోకేశ్

Nara Lokesh Slams CM Jagan: గత ఎన్నికల్లో తనకు ఓటేసిన వారినే సీఎం జగన్ కాటేస్తున్నారంటూ టీడీపీ...
Nara Lokesh Slams CM Jagan: గత ఎన్నికల్లో తనకు ఓటేసిన వారినే సీఎం జగన్ కాటేస్తున్నారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. మధ్యపాన నిషేధం పేరుతో ప్రజలను దోచుకుంటున్న తీరుపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపులతోనే ఓం ప్రతాప్ చనిపోయాడని ఆరోపించారు. ఆ మేరకు అతని ఫోటోలను కూడా లోకేశ్ ట్వీట్ చేశారు.
చంపేస్తామంటూ వైసీపీ నేతలు, పోలీసుల కారణంగానే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమాల మండలం కందూరు గ్రామానికి చెందిన ఓం ప్రతాప్ చనిపోయాడని ఆరోపించారు. ఓం ప్రతాప్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ప్రమేయమున్న వైసీపీ ముఖ్య నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు దళితులకు లేదా? అని ప్రశ్నించారు. దళితులపై జగన్ ప్రభుత్వ దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.