లోకేష్ అస్త్రంగా బాబు కొత్త ప్లాన్

లోకేష్ అస్త్రంగా బాబు కొత్త ప్లాన్
x
Highlights

Nara Lokesh Cycle Yatra: రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందుకు గాను లోకేష్ ను రంగంలోకి దింపే...

Nara Lokesh Cycle Yatra: రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందుకు గాను లోకేష్ ను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత చినబాబు సైకిల్ యాత్ర ప్రారంభించాలని పార్టీ భావిస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘోర పరాజయం చవిచూసింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఇంత దారుణంగా పార్టీ ఒడిపోలేదు. దీనితో పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బాగానే హైలెట్ చేస్తునప్పటికి పార్టీలో ఎక్కువగా సీనియారిటీనే కనిపిస్తుంది తప్ప యువ నాయకత్వం పెద్ద ఆక్టివ్ గా ఉన్నట్టు కనపడడం లేదు. ఈ గ్యాప్ ని పూర్తి చేయడానికి పార్టీ సిద్దమవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే పార్టీ అధినాయకుడి తనయుడు, కాబోయే సీఎం అంటూ ప్రచారం జరుగుతున్న లోకేష్ సైకిల్ యాత్ర తెరపైకి వచ్చింది. ఇది వ్యక్తిగతంగా లోకేష్ నాయకత్వంతో పాటు పార్టీకి లబ్ది చేకూర్చగలదన్న నమ్మకం పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. 23 సీట్లు సాధించటంతో పార్టీలో ఒక అంతర్మథనం మొదలు అయ్యింది. దీనితో 2024లో ఎన్నికలకు సరైన స్టాండ్ తో వెళ్ళాలని పార్టీ భావిస్తుంది. పార్టీలో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడుతో పాటు మరి కొంత మంది సీనియర్ నాయకులు ఉన్నా యువ నాయకత్వం లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, సైకిల్ యాత్ర పై లోకేష్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోపక్క లోకేష్ నాయకత్వాన్ని పార్టీలో అందరి ఆమోదం పొందేలా చాలా కృషి జరగాల్సి ఉంది. అధినేత బిడ్డగా అందరికి అభిమానం ఉన్నా, ఉన్నత చదువులు చదువుకున్నా అందరి ఆమోదాన్ని పొందడం అంత సులువేమీ కాదు. కొన్ని బహిరంగ సభల్లోనే పొరపాట్లు మాట్లాడిన లోకేష్ ఇప్పుడు జనాల్లోకి వెళ్తే పార్టీకి ఉన్న కాస్త పరువు పోతుంది అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఐతే ఇలాంటి పొరపాట్లను ఎవరూ పెద్దగా లెక్క చేయరని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే నాయకుడు కావాలి. అదీ అధినేత తనయుడు అయితే మరీ మంచిది అనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత నారా లోకేష్ సైకిల్ యాత్ర చేయాఅని భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాల సమయం ఉంది గనుక, ఈలోగ లోకేష్ రాటుదేలుతాడనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories